బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 మే 2017 (17:24 IST)

గారెల కోసం గొడవ.. రుచిగా లేవని హోటల్ యజమాని గొంతుకోసేశాడు..

గారెల కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. క్షణికావేశంతో జరిగే హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. భావోద్వేగాలకు లోనై.. దారుణాలకు పాల్పడే ఘటనలు దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా గారెలు రుచిగా లేవనే చిన్

గారెల కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. క్షణికావేశంతో జరిగే హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. భావోద్వేగాలకు లోనై.. దారుణాలకు పాల్పడే ఘటనలు దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా గారెలు రుచిగా లేవనే చిన్న కారణంతో హోటల్ యజమానిని ఓ యువకుడు గొంతుకోసి చంపేసిన ఘటన కేరళలోని మంగళప్పిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల రతీష్ అనే ట్యాక్సీ డ్రైవర్.. జాన్సన్ నడుపుతున్న హోటల్‌కు వెళ్లాడు. ఆ హోటల్‌లో గారెలు ఆర్డర్ చేశాడు. ఫుల్‌గా లాగించేశాడు. ఆపై వడలు రుచిగా లేవని జాన్సన్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. దీంతో కస్టమర్లకు ఇబ్బందిగా ఉందని.. ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందిగా జాన్సన్ రతీష్‌ను హోటల్‌ నుంచి గెంటేశాడు. 
 
బయటకు వెళ్లిన రతీష్.. ఫూటుగా తాగి.. బైకుపై వెళ్తున్న జాన్సన్‌ను అడ్డుకుని గొంతుకోసి పారిపోయాడు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాన్సన్ మరణించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రతీష్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.