సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (12:01 IST)

బస్సు చార్జీలు తగ్గించిన ఒడిశా ప్రభుత్వం

ఒడిశా ప్రభుత్వం ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. బస్సు చార్జీలను తగ్గించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌, వ్యాట్‌ తగ్గించాయి. దీంతో ఒడిశా ఆర్టీసీ, ప్రైవేటు ఆపరేటర్లు బస్సు ఛార్జీలు తగ్గించారు.
 
ఈ తగ్గింపు 5 పైసల నుంచి 17 పైసలు వరకు ఉంది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కిలోమీటరుకు 5 పైసలు, ఏసీ, డీలక్స్‌ బస్సులు 10 పైసలు, సూపర్‌ ప్రీమియం ఛార్జీలు 17 పైసలు తగ్గాయి. ఛార్జీల పెంపు, తగ్గింపు అంతా ఇంధన ధరలను బట్టి ఆటోమేటిక్‌ సిస్టం ద్వారా జరుగుతోంది.