శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 26 మే 2020 (09:24 IST)

15 వేల కేంద్రాల్లో సీబీఎస్‌ఈ పరీక్షలు

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) జూలై 1 నుంచి జూలై 15 వరకు దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో పెండింగ్‌లో వున్న 10, 12 వ తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ తెలిపారు.

మూడు వేల కేంద్రాల్లో నిర్వహించే పరీక్షా కేంద్రాలను 15 వేలకు పెంచినట్టు చెప్పారు. భౌతికదూరం పాటించేందుకు, విద్యార్థుల ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి కీలకమైన పెండింగ్‌లో వున్న పరీక్షలను మాత్రమే నిర్వహిస్తామని బోర్డు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.

అలాగే బోర్డు పరీక్షా ఫలితాలను జులై నెలాఖరులోగా ప్రకటించేలా కసరత్తు చేస్తున్నట్టు హెచ్‌ఆర్‌డి మంత్రి తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు నిర్వహించిన పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు.