సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (15:13 IST)

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 'వై-బ్రేక్ - యోగ' విరామం!

Yoga
కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం లభించే వెసులుబాటును కల్పించే దిశగా కేంద్రం ఆలోచన చేసింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో చైతన్యం నింపేందుకు కేంద్రం ఇప్పుడిదే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఉద్యోగులకు 'వై బ్రేక్': 'అంటే యోగా బ్రేక్' అన్నమాట. ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందేందుకు కార్యాలయంలో కూర్చున్న చోటే కాసేపు యోగా చేయాలని పేర్కొంది. 
 
ఈ మేరకు 'వై బ్రేక్‌కు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విభాగాల్లో అమలు చేయాలంటూ అన్ని శాఖలకు ఆయుష్ మంత్రిత్వశాఖ సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఈ యోగా బ్రేక్‌ను గత యేడాది జనవరి ఆరు మెట్రో నగరాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు ఆయుష్ శాఖ పేర్కొంది. కాగా ఇప్పటికే కేంద్ర హైవేలకు సంబంధించిన విభాగాల్లోని ఉద్యోగుల కోసం ఈనెల 2 వ తేదీ నుంచే 'వై బ్రేక్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్ర హైవేల మంత్రిత్వశాఖ పేర్కొంది.