మంత్రి వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేదా : మంత్రి జోగి రమేష్ ఫైర్
ఉద్యోగులపై ఏపీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. మంత్రి వస్తే లేచి నిలబడాలన్న కామన్ సెన్స్ లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు కామన్ సెన్స్ లేదా బుద్ధి లేదా అంటూ విరుచుకుపడ్డారు.
విజయవాడలోని రైతు శిక్షణ కేంద్రంలో మంగళవారం ఉమ్మడి కృష్ణా జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి జోగి రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన సమావేశ హాలులోకి వచ్చినప్పుడు వేదికకు ముందు ఉన్న మూడు వరుసల్లోని అధికారులు మాత్రమే లేచి నిలబడ్డారు.
నాలుగో వరుస నుంచి చివరి వరకు ఉన్న వారు మాత్రం ఎవరి సీట్లలో వారు కూర్చొన్నారు. వీరిని చూడగానే మంత్రికి ఆగ్రహం కలిగించింది. వేదిక మీదకు వెళ్లగానే ఆయన మైకు అందుకున్నారు. 'మంత్రి వస్తే సీట్లలో నుంచి లేచి నిలబడాలన్న కామన్స్ లేదా... మీకు బుద్ధి ఉందా...' అంటూ తనలోని అసహనాన్ని వ్యక్తం చేశారు.