బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (13:58 IST)

కరోనా సోకిన మైనర్‌పై స్వీపర్ వేధింపులు.. వాష్‌రూమ్‌కు వెళ్తే..?

వయోబేధం లేకుండా.. మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కరోనా రోగులపై కూడా అఘాయిత్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
 
తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తొమ్మిదేళ్ల మైనర్‌పై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ తొమ్మిదేళ్ల బాలికకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బాలికను ఖమ్తరై పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్‌ దవాఖాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కరోనా చికిత్సా కేంద్రానికి తరలించారు.
 
ఆగస్టు 2న బాధితురాలు దవాఖానలో చేరగా అప్పటి నుంచి కన్హైలాల్ నిషాద్ (45) అనే స్వీపర్‌ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడు. గురువారం ఉదయం బాలిక పళ్లు తోముకోవడానికని వాష్‌రూమ్‌కు వెళ్లగా స్వీపర్‌ ఆమె వెంట వచ్చి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. 
 
దీంతో బాలిక తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు దవాఖానకు చేరుకొని స్వీపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.