ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (10:39 IST)

డొనాల్ట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు... కరోనా వ్యాక్సిన్‌ నవంబర్‌లోనే వస్తుందట..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2021 ప్రారంభంలోనే కరోనాకు వ్యాక్సిన్‌ను రిలీజ్ చేస్తామని సీడీసీ అధికారులు తెలిపారు. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం నవంబర్ మొదటివారంలోగా వాక్సిన్ అందుబాటులో ఉంటుందని ట్రంప్ చెప్పారు.

ఇక ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించేందుకే ట్రంప్ ఇలా చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 
 
కాగా 2020 నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారం ఊపందుకుంది. ఒకవైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నప్పటికీ ఎన్నికలను వాయిదా వేసేందుకు వీలులేకపోవడంతో అనుకున్నట్టుగానే ఎన్నికలు జరగబోతున్నాయి.
 
కానీ సీడీసీ అధికారులు కరోనా వాక్సిన్ రిలీజ్ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, 2021 ప్రారంభంలో వాక్సిన్ వస్తుందని చెప్పారు. అయితే అధ్యక్షుడు ట్రంప్ మాత్రం కరోనా వాక్సిన్ నవంబర్ మొదటివారంలోనే అమెరికాలో అందుబాటులోకి వస్తుందని చెప్పడంతో సంచలనంగా మారింది.