శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (12:30 IST)

అలా చేస్తేనే ఉగ్రవాదాన్ని అంతం చేయొచ్చు.. లేదంటే కష్టం : బిపిన్ రావత్

ఉగ్రవాదులకు అన్ని రకాలుగా సాయం చేస్తున్న దేశాలను ఏకాకులు చేయాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ, 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదంపై అమెరికా ఉక్కుపాదం మోపిందని గుర్తుచేశారు. 
 
అయితే, ఉగ్రవాదులకు చాలా దేశాలు ఆర్థిక, ఆయుధ సాయం చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి దేశాలను టార్గెట్ చేసి, వాటిని ఏకాకులు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అపుడే ఉగ్రవాదం పీచమణచగలమని అభిప్రాయపడ్డారు. 
 
అయితే, కొన్ని దేశాలు ఉగ్రవాదులకు ఆయుధాలు, నిధులను సమకూరుస్తున్నంత కాలం టెర్రరిజాన్ని అంతం చేయలేమన్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలంటే వారిని ఏకాకులను చేయాలని... వారికి సహకరిస్తున్న దేశాలను టార్గెట్ చేయాలని అన్నారు. 
 
టెర్రరిస్టులకు సహకరిస్తున్న దేశాలను ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) బ్లాక్ లిస్టులో పెడుతుండటం మంచి పరిణామమని చెప్పారు. ఇలాంటి చర్యలతో ఉగ్రవాదులకు సహకరిస్తున్న దేశాలను ఏకాకి చేయవచ్చని తెలిపారు.