ఇండియన ఆర్మీ చీఫ్‌గా మనోజ్ ముకుంద్
భారత సైన్యాధ్యక్షుడుగా జనరల్ మనోజ్ ముకుందే నరవణే నియమితులయ్యారు. ఈ మేరకు రక్షణ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన జనరల్ బిపిన్ రావత్ మంగళవారంతో పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆయన మహా సైన్యాధిపతి (త్రివిధ దళాల అధిపతి)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో దేశ 28వ కొత్త ఆర్మీ చీఫ్‌ను కేంద్ర నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీచేసింది.
కాగా, తదుపరి సైన్యాధ్యక్షుడు మనోజ్ ముకుంద్ నరవణేకు అభినందనలు తెలిపిన రావత్, భారత సైన్యాన్ని ముందుకు నడిపించడంలో ఆయన శక్తియుక్తులు సమర్థవంతంగా పని చేస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, బుధవారం నాడు బిపిన్ రావత్ భారత తొలి సీడీఎస్‌గా పదవీ బాధ్యతలను చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ సీడీఎస్ పదవిని కొత్తగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు సృష్టించిన విషయం తెల్సిందే.