మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (13:10 IST)

మార్కెట్‌లోకి వచ్చిన Nokia 2.3 ఫోన్‌- ధర రూ.8199

ఇండియాలో బడ్జెట్ సెగ్మెంట్‌లో హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేసిన నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్ సేల్ ఈరోజు ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒకేసారి ఆన్‌లైన్‌లో, అలాగే ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి రానుంది. హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను కొద్దిరోజుల క్రితమే పరిచయం చేసింది.

ఈ ఫోన్ నేటి నుండి అనగా, డిసెంబర్ 27వ తేదీ నుండి మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది అని ముందే పేర్కొంది. 'బడే కామ్ కా ఫోన్' అంటూ నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను ప్రమోట్ చేసింది.
 
నోకియా 2.2 మోడల్‌కి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్‌లో విడుదలకు సిద్ధమైంది. రెండు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని, దీని ధర రూ.8,199 మాత్రమే అని తెలిపింది.
 
నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్‌ను 2020 మార్చి 31 లోపు కొని 2020 ఏప్రిల్ 7 లోగా యాక్టివేట్ చేసుకున్న వారికి రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. రీప్లేస్‌మెంట్ గ్యారెంటీ ఆఫర్ పొందాలంటే ఒరిజినల్ ఇన్‌వాయిస్‌ను భద్రపరచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటో ఒకసారి లుక్కేయండి..
 
ఈ ఫోన్ ప్రత్యేకతలు: 
* 6.2 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 
* 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 
* 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్,
* నోకియా 2.3 స్మార్ట్‌ఫోన్ 2 జీబీ+32 జీబీ వేరియంట్‌తో రిలీజైంది.
* మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
* బ్యాటరీ 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ.
 
* ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
* ఇందులో డ్యూయెల్ సిమ్‌తో పాటు మెమొరీ కార్డుకు స్లాట్ కూడా ఉంటుంది.
* చార్‌కోల్, సియాన్ గ్రీన్, సాండ్ కలర్స్‌లో లభిస్తుంది.