నోకియా నుంచి 7.1స్మార్ట్ ఫోన్.. భారీ తగ్గింపుతో అందుబాటులోకి?
నోకియా నుంచి 7.1 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ వన్‌తో.. డ్యుయెల్ కెమెరాలతో పనిచేస్తుంది. హెచ్డీఆర్ 10కి సపోర్ట్ చేసే విధంగా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్ రూ.19,999 రూపాయల ధరతో అందుబాటులోకి వస్తుంది.
ఈ ధరలో నోకియా అధికారిక వెబ్ సైట్ నుంచి (నోకియాడాట్‌కామ్) హెచ్‌ఎండీ గ్లోబల్ దీనిపైన రెండు వేల రూపాయల వరకు భారీ తగ్గింపును ప్రకటించింది. దీనిని బట్టి రూ.17.999 ధరకు ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వుంటుంది.
ఇకపోతే.. నోకియాడాట్‌కామ్ నుంచి రూ.15,999 ధరతో లభిస్తుండగా, అమేజాన్ ఇండియా నుండి మాత్రం కేవలం రూ. 14,999 ధరతో లభిస్తుంది. ఈ డిస్‌ప్లే కూడా ఒక 19:9 ఆస్పెక్ట్ రేషియా గల ఒక 5.84 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్‌తో వుంటుంది.
ఈ డిస్‌ప్లే పైన ఒక నోచ్ ఉంది, కానీ ఇది ఇతర ఫోన్లలో చూసిన వంటి పెద్ద నోచ్ మాత్రం కాదు. ఈ డిస్ ప్లే ఓ గ్లాస్ శాండ్విచ్ బాడీతో వుంది. ఈ నోకియా ఫోన్ నిగనిగలాడే గ్లాస్ ఫినిషింగ్ కోసం 6000 సిరీస్ అల్యూమినియం ఉపయోగించారని నోకియా సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.