ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (15:57 IST)

రూ.1199కే నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్..

మొబైల్ దిగ్గడం హెచ్ఎండీ గ్లోబల్ ఇవాళ భారత మార్కెట్‌లోకి నోకియా 105 (2019) ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 1.77 అంగుళాల కలర్ డిస్‌ప్లేను అమర్చారు. ఇందులో 2 వేల వరకు కాంటాక్ట్‌లను, అలాగే 500 ఎస్ఎమ్ఎస్‌లను స్టోర్ చేసుకోవచ్చు. 
 
ఈ ఫోన్‌లో ఎఫ్ఎం రేడియో, ఎల్ఈడీ టార్చి లైట్, ప్రీ లోడెడ్ గేమ్స్, 4ఎంబీ ర్యామ్, 4ఎంబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 800 ఎంఏహెచ్ బ్యాటరీ 18.2 రోజుల వరకు స్టాండ్‌బై టైం తదితర ఫీచర్లను అందిస్తున్నారు. 
 
ఇందులో నోకియా సిరీస్ 30 ప్లస్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేసారు. ఈ ఫోన్ బ్లూ, పింక్, బ్లాక్ రంగుల్లో లభ్యమవుతుంది. కాగా ఈ ఫోన్‌ను రూ.1199 ధరకు కొనుగోలు చేయవచ్చు.