సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (21:55 IST)

విచారణకు రెడీ.. ట్యాపింగ్​ కేసుపై కుమారస్వామి

కొద్ది రోజులుగా కర్నాటకను కుదిపేస్తున్న ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో బీజేపీ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ సీఎం కుమారస్వామిని ఇరుకునపెట్టేలా ట్యాపింగ్​ కేసుల దర్యాప్తును కేంద్ర ఏజెన్సీ సీబీఐకి అప్పగించనున్నట్లు సీఎం యడియూరప్ప ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు సోమవారమే సీబీఐకి లెటర్​ రాస్తానని చెప్పారు. 
 
కొద్దిరోజుల కిందట రాష్ట్రంలో పొలికల్​ క్రైసిస్​ తలెత్తిన సందర్భంలో నాటి సీఎం కుమారస్వామి.. బీజేపీ, కాంగ్రెస్​కు చెందిన కీలక నేతలు, ఇంకొందరు అధికారుల ఫోన్లు ట్యాప్​ చేయించారనే ఆరోపణలొచ్చాయి. అక్రమంగా ఫోన్లు ట్యాప్​ చేసి, రాజీనామాలు వెనక్కి తీసుకోకుంటే ఆడియో క్లిప్స్​ బయటపెడతానని కుమారస్వామి బెదిరించినట్లు రెబల్​ ఎమ్మెల్యేల్లో ఒకరైన ఏహెచ్​ విశ్వనాథ్​(జేడీఎస్​) ఆరోపించారు. 
 
బెంగళూరు సిటీ పోలీస్​ కమిషనర్​ ఓ అధికారితో మాట్లాడిన ఆడియో క్లిప్​ కూడా సంచలనం రేపింది. ఫోన్​ ట్యాపింగ్స్​పై సీబీఐ ఎంక్వైరీని కాంగ్రెస్​ పార్టీ స్వాగతించింది. అయితే గతంలోలా సీబీఐని బీజేపీ తన సొంతానికి వాడుకోవద్దని, వేరే పార్టీల ఎమ్మెల్యేల్ని బీజేపీలోకి చేర్చుకున్న 'ఆపరేషన్​ కమల్'పైనా విచారణ చేయించాలని కాంగ్రెస్​ లీడర్​ సిద్దరామయ్య కోరారు. 
 
కాగా, ఫోన్​ట్యాపింగ్​ వ్యవహారంతో తనకు సంబంధంలేదని, కొన్ని లోకల్​ టీవీ చానెల్స్​ పనిగట్టుకుని ప్రాపగండా చేశాయని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. 'సీబీఐతో కాకుంటే ఇంటర్నేషనల్​ ఏజెన్సీతోనైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. కావాలనుకుంటే దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు ఫిర్యాదుచేసి, ఆయన తరఫున ఎవరితోనైనా దర్యాప్తు చేయించినా ఫర్వాలేదు' అని కుమారస్వామి మండిపడ్డారు.