శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 14 అక్టోబరు 2021 (17:11 IST)

ఒకే వేదికపై చిరు-బాలయ్య?

మెగాస్టార్​ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు వీరితో పాటు రామ్​చరణ్​ కూడా పాల్గొంటారని సమాచారం.
 
నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా.. ప్రముఖ డిజిటల్​ ప్లాట్​ఫామ్​ 'ఆహా'(OTT Platform Aha) ఓ టాక్​ షో(Balakrishna talk show) నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే'(Unstoppable With NBK) అని నామకరణం చేశారు.

ఈ టాక్​ షోలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. అయితే ఇందులోని తొలి ఎపిసోడ్​లో మంచు మోహన్​బాబు అతిథిగా రానున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ షోకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు టాలీవుడ్​లో చక్కర్లు కొడుతోంది.