1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 7 ఆగస్టు 2021 (17:00 IST)

భజ‌రంగ్ భ‌ళీ అంటున్న నంద‌మూరి బాల‌య్య‌

రెజ్లింగ్‌లో భజరంగ్ విజయం దేశానికే గర్వకారణమ‌ని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ 65 కిలోల విభాగంలో భజ్‌రంగ్ పునియాకు కాంస్యం సాధించడం దేశానికే గర్వకారణమ‌న్నారు.
 
కజకిస్థాన్ రెజ్లర్ నియాజ్ బెకోవ్పై 8-0 తేడాతో భజ్‌రంగ్ సాధించిన విజయం హర్షణీయం. కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి దేశానికి ఆరో పథకం అందించిన భజరంగ్ ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాఅని బాల‌య్య ప్ర‌శంసించారు.

భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని పథకాలు సాధించాలి. దేశం మరింత గర్వించేలా చేయాలని కోరుకుంటున్నాఅని హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.