గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 జూన్ 2024 (10:59 IST)

అత్తపై అత్యాచారం.. ప్రతిఘటించిందని హత్య.. మైనర్ బాలుడి అరెస్ట్

woman
కర్ణాటకలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు అకృత్యానికి పాల్పడ్డాడు. అత్తపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆమెను హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లా ఉప్పినంగడి సమీపంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. 37 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. ఆదివారం ఆమె ఇంట్లో ఉన్న నిందితుడు మైనర్ బాలుడు, మహిళ నిద్రిస్తున్న సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, ఆ మహిళ ప్రతిఘటించి, అతనిని తిట్టింది. ప్రవర్తనను మార్చుకోమంది. అయితే తన గురించి ఇతరులకు చెబుతుందనే భయంతో, 10వ తరగతి విద్యార్థిని తిరిగి నిద్రలోకి వెళ్ళిన కొంతసేపటి తర్వాత దిండుతో ఆమెను ఊపిరాడనీయకుండా చంపేశాడు.
 
అయితే మహిళ గుండెపోటుకు గురై చనిపోయిందని తండ్రికి తెలిపాడు నిందితుడు. అయితే మహిళ మృతదేహాన్ని చూసినప్పటి నుంచి పోలీసులకు బాలుడిపై అనుమానం వచ్చింది. నిందితుడి వీపుపై గీతలు ఉండడంతో అతడి తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అతనిని ప్రశ్నించినప్పుడు, ఆ బాలుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు.