రాహుల్ గాంధీని.. నువ్వు ఎవరికి పుట్టావంటూ అడుగుతారా?: కేసీఆర్ ఫైర్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అలా దిగజారి మాట్లాడవచ్చా? అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ కేసీఆర్. ఇంత అహంకారమా..? కళ్లు నెత్తికెక్కాయా.. అంటూ ఆయన ఘాటుగా స్పందించారు కేసీఆర్. పీవోకేలో ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు బయటపెట్టాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించిన విషయం తెలిసిందే కాగా.. రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
"నువ్వు రాజీవ్ గాంధీ కొడుకువో కాదో అని మేం ప్రూఫ్ అడిగామా" అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తీవ్రస్థాయిలో బీజేపీపై విరుచుకుపడ్డారు.
"రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా.. ఓ విషయం నన్ను బాధించింది.. ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి.. కేంద్రాన్ని ఏదో ప్రశ్న అడిగారు.. దానిపై స్పందించిన బీజేపీ సీఎం.. నువ్వు ఎవరికి పుట్టావంటూ వ్యాఖ్యానించారని మండిపడ్డారు.
ఆ మాటలు వింటే నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయన్న కేసీఆర్.. ఇదా మన సంప్రదాయం అంటూ నరేంద్ర మోడీని, జేపీ నడ్డాను నిలదీశారు దీనిపై సమాధానం చెప్పాలని.. వెంటనే అస్సాం సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.