బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (19:39 IST)

మళ్లీ వివాదంలో నగ్మా.. పాక్ జర్నలిస్టుకు మద్దతు..

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి నగ్మా మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. భారత్‌పై తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ జర్నలిస్టుకు నగ్మా మద్దతు తెలపడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ''మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు'' పేరిట ఓ హిందీ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమం నిర్వహించింది. 
 
ఈ కార్యక్రమంలో నగ్మా, పాక్ జర్నలిస్టు తరీఖ్ పీర్జాదా పాల్గొన్నారు. పాకిస్థాన్‌ను పొగుడుతూ.. భారత్‌ను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు శ్రుతి మించడంతో సదరు ఛానెల్ వ్యాఖ్యాత అడ్డుతగిలారు. అయితే, భారత్‌పై విషం కక్కుతూ వ్యాఖ్యలు చేసిన పీర్జాదాను ఎండగట్టాల్సింది పోయి వ్యాఖ్యాతపై నగ్మా ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఆ జర్నలిస్ట్‌ను కించపరిచేందుకే ఈ చర్చా కార్యక్రమం నిర్వహించారా? అంటూ ఆ వ్యాఖ్యాతను ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ చర్చా కార్యక్రమం అనంతరం పాక్ జర్నలిస్ట్‌కు మద్దతుగా ఆమె ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు నగ్మాపై మండిపడుతున్నారు.