సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : సోమవారం, 15 జులై 2019 (08:01 IST)

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమం

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొన్ని నెలలుగా ఆయన కేన్సర్‌తో బాధపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నుంచే అపోలోలో చికిత్స పొందుతున్న ముఖేష్‌గౌడ్‌ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లు తెలిసింది.
వైద్యానికి ముఖేష్‌గౌడ్‌ శరీరం సహకరించపోవడంతో అపోలో వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  ముఖేష్ గౌడ్ వైఎస్ మంత్రివర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.