శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2016 (16:07 IST)

సోనియా గాంధీకి వైరల్ ఫీవర్.. శ్రీ గంగా ఆస్పత్రిలో చేరిక.. సుర్జేవాలా

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాందీ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించిన ఆమె.. అక్కడ ప్రచారరథం మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయమైంది. అప్పట్లో ఆమెను ఢిల్లీలోని

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాందీ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించిన ఆమె.. అక్కడ ప్రచారరథం మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయమైంది. అప్పట్లో ఆమెను ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చాలా కాలం పాటు ఆమెకు చికిత్స అందించాల్సి వచ్చింది. తాజాగా వైరల్ ఫీవర్ కారణంగా ఆమెను ఢిల్లీ శ్రీ గంగా ఆస్పత్రిలో చేర్చినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా ప్రకటించారు. 
 
గతంలో కేన్సర్ బారిన పడిన సోనియా గాంధీకి అమెరికాలో చికిత్స అందించారు. గడిచిన మూడు నెలల్లో సోనియా గాంధీని ఆస్పత్రికి తరలించడం ఇది రెండోసారి అని.. రెండు రోజుల పాటు ఆమె గంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతారని సుర్జేవాలా తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీన సోనియా గాంధీని భుజం నొప్పి, డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేర్చారు. ఆ సందర్భంగా ఆమెకు చిన్నపాటి శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం జ్వరం కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సుర్జేవాలా ప్రకటించారు.