మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2024 (15:30 IST)

Bengaluru: భార్య, అత్తారింటి వేధింపులు.. హెడ్ కానిస్టేబుల్‌ రైలు కింద పడి ఆత్మహత్య

suicide
సంచలనం సృష్టించిన అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసును మరవక ముందే.. ఓ పోలీసు భార్యతో పాటు అత్తారింటి వేధింపుల కారణంగా శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు 34 ఏళ్ల హెచ్.సి. తిప్పన్న, బెంగళూరులోని హుళిమావు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 
 
తిప్పన్న శుక్రవారం రాత్రి బెంగళూరులోని హీలాలిగే రైల్వేస్టేషన్, కార్మెలారం హుసగూరు రైల్వే గేట్ మధ్య రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్‌లో, తాను బలవన్మరణానికి పాల్పడేందుకు తన భార్య, అత్తమామలే కారణమని తెలిపాడు. 
 
తిప్పన్న మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై బైప్పనహళ్లి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణించే సమయంలో తిప్పన్న యూనిఫాంలో ఉండటం గమనార్హం. 
 
తన డెత్ నోట్‌లో తిప్పన్న ఇలా పేర్కొన్నాడు: "నా భార్య వేధింపులకు తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా భార్య తండ్రి యమునప్పతో నన్ను ఫోనులో బెదిరించాడు. 
 
మరుసటి రోజు ఉదయం నేను తిరిగి ఫోన్ చేసినప్పుడు, అతను నన్ను చనిపోవాలని కోరాడు, నేను లేకుండా తన కుమార్తె బాగుంటుందని చెప్పాడు. అతను నన్ను కూడా దుర్భాషలాడాడు" అని తెలిపాడు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 108, 351(3), 352 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.