భార్యాభర్తలను కొట్టి... మహిళ దుస్తులు చించేసి లైంగిక వేధింపులు.. టోల్గేట్ సిబ్బంది వేధింపులు
మహారాష్ట్రలో టోల్‌ప్లాజా సిబ్బంది రెచ్చిపోయారు. థానే నుంచి ముంబై వెళుతున్న ఓ జంటపై టోల్గేట్ సిబ్బంది విరుచుకుపడ్డారు. తొలుత భార్యాభర్తలను తీవ్రంగా కొట్టిన సిబ్బంది... ఆ తర్వాత మహిళ గుడ్డలు చించేసి లై
మహారాష్ట్రలో టోల్‌ప్లాజా సిబ్బంది రెచ్చిపోయారు. థానే నుంచి ముంబై వెళుతున్న ఓ జంటపై టోల్గేట్ సిబ్బంది విరుచుకుపడ్డారు. తొలుత భార్యాభర్తలను తీవ్రంగా కొట్టిన సిబ్బంది... ఆ తర్వాత మహిళ గుడ్డలు చించేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.
థానే జిల్లాలోని పడ్ఘా వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటైన టోల్ గేట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... వ్యక్తిగత పని నిమిత్తం ఓ జంట కారులో ముంబై బయలుదేరింది. టోల్గేట్ వద్ద వారి కారు ఆగగా ట్యాక్స్ కట్టించుకున్న టోల్గేట్ ఏజెంట్ బిల్లు ఇచ్చే విషయంలో తీవ్ర జాప్యం చేశాడు.
ఇదేమని కారు డ్రైవర్ అడిగిన పాపానికి ఆ ఏజెంట్ సహా 13 మంది కారును చుట్టుముట్టి దంపతులపై దాడికి దిగారు. ఆ తర్వాత మహిళను కిందకు దించేసి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో మహిళ దుస్తులు చిరిగిపోయినా ఆ దుర్మార్గులు కనికరించలేదు. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించుకున్న దంపతులు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ జరుపుతున్నారు.