శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 మే 2021 (14:47 IST)

రూ.100ల కోసం భార్యాభర్తల మధ్య గొడవ.. చివరికి ఏం జరిగిందంటే?

ఢిల్లీలో భార్యభర్తలు దారుణానికి పాల్పడ్డారు. వంద రూపాయల కోసం ఓ 40ఏళ్ల వ్యక్తితో దంపతులు గొడవకు దిగారు. ఈ ఘర్షణలో అతడిపై కత్తితో దాడిచేసి పొడిచారు. దీంతో ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని మంగోల్పురికి చెందిన నిందితుడు జితేందర్, అజిత్(40) అనే వ్యక్తిని రూ.100 ఇవ్వాలని కోరాడు. ఈ అంశంపై ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన అజిత్..ఆగ్రహంతో జితేందర్ను కొట్టాడు. ఆ తర్వాత.. జితేందర్ ఇంటికి వెళ్లి కత్తితో తిరిగొచ్చాడు. 
 
అతడితో పాటు అతడి భార్య కూడా వచ్చింది. వారిద్దరూ అజిత్‌పై దాడి చేసి.. కత్తితో పొడిచి పరారయ్యారు. విషయం తెలిసిన పోలీసులు.. సంజయ్ గాంధీ ఆస్పత్రికి చేరుకుని విచారించారు.
 
అప్పటికే తీవ్ర రక్తస్రావమైన బాధితుడు..ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జితేందర్ భార్య రేష్మను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న జితేందర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.