గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 15 మే 2021 (15:25 IST)

ఆక్సిజ‌న్ కోసం మిస్డ్ కాల్ ఇవ్వండి అంటున్న సోనుసూద్‌

sonu sood
క‌రోనా కార‌ణంగా అల్లాడుతున్న ఎంద‌రినో ఆదుకున్న మాన‌వ‌తా వాది సోనుసూద్‌. ఆయ‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌లే బెంగుళూరులో ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బంది ప‌డుతున్న వారిని ప్రాణాల‌ను కాపాడింది ఆయ‌న టీమ్. ఇప్పుడు అదే ప‌నిలో వున్నారు సోనుసూద్ టీమ్‌. శ‌నివారంనాడు ఆయ‌న ఓ వీడియో ద్వారా సేవ‌లు వినియోగించుకోండ‌ని వెల్ల‌డిస్తున్నారు. ఇది ఉచిత సేవ అని గ‌మ‌నించ‌డండి అంటున్నారు.
 
దేశంలో ఢిల్లీలో చాలామంది క‌రోనా పేషెంట్స్ ఆక్సిజ‌న్ అంద‌క నానా క‌ష్టాలుప‌డుతున్నార‌ని నా దృష్టికి వ‌చ్చింది. నాకు చాలామంది ఫోన్ చేసి చెబుతున్నారు. అందుకే ఢిల్లీలో ఎక్క‌డున్న‌వారైనా  ఫోన్‌. నెంబ‌ర్ 022-61403615 కు మిస్ కాల్ ఇవ్వండి. త‌క్ష‌ణ‌మే సూద్ ఫౌండేష‌న్‌, తుష్టి ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు ఏర్పాటు చేస్తాం. వీటిని అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా అవ‌స‌రంలేనివారు వాటిని వెంట‌నే తిరిగి ఇచ్చేయండి. అంటూ క్లారిటీ ఇచ్చారు. సూద్ ఫౌండేష‌న్ చేస్తున్న సేవ‌ల‌కు స్పూర్తి పొందిన తుష్టి ఫౌండేష‌న్ కూడా జ‌త‌క‌లిసింది.