శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (17:48 IST)

భారత్‌లోకి ప్రవేశించిన ఎక్స్ఈ- గుజరాత్‌లో 67 ఏళ్ల వ్యక్తికి..?

coronavirus
కరోనా మహమ్మారి రోజు రోజుకు రూపాంతరం చెందుతోంది. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా విజృంభించింది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఉప-వర్గాలు, పలు హైబ్రిడ్ వేరియంట్‌లు పుట్టుకొస్తున్నాయి. 
 
యూకేలో తొలిసారి జనవరి 19న ఎక్స్ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించిన విషయం తెలిసిందే.
 
యూకేలో తొలిసారిగా గుర్తించిన ఎక్స్ఈ హైబ్రిడ్ వేరియంట్‌.. భారత్‌లోకి ప్రవేశించింది. ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ మొదటి కేసు ముంబైలో నమోదయ్యింది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. తాజాగా గుజరాత్‌లో ఎక్స్ఈ నమోదైనట్లు తెలుస్తోంది. 67ఏళ్ల వ్యక్తిని ఈ వైరస్ కబళించినట్లు వైద్యులు చెప్తున్నారు.