మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 నవంబరు 2017 (12:10 IST)

నేరగాళ్లను కాల్చి చంపేస్తున్నాం : సీఎం యోగి ఆదిత్యనాథ్

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా మెరుగుపడినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఘజియాబా

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగా మెరుగుపడినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభిప్రాయపడ్డారు. త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఘజియాబాద్‌లోని రామ్‌లీలా గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగుపడినట్టు చెప్పారు. నేరగాళ్లను జైలుకు పంపడమో, ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడమో చేస్తున్నట్టు చెప్పారు. 
 
2017కు ముందు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండేది కాదు. నేరాలు ఇష్టానుసారం జరిగేవి. దీంతో భయపడిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, యువత రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి వస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పెట్టుబడులు వస్తున్నాయన్నారు. నేరగాళ్లకు ఇప్పుడు రెండే చోట్లు ఉన్నాయని, ఒకటి జైలుకు వెళ్లడం, లేదంటే యమరాజు ఇంటికి వెళ్లడమని వివరించారు. ఎక్కడికి వెళ్తారో వారే తేల్చుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు.