పదేళ్ల బాలుడిని తినేసిన మొసలి... కొట్టి చంపేసిన గ్రామస్థులు
బీహార్ రాష్ట్రంలో ఇటీవల ఓ మొసలి పదేళ్ల బాలుడిని చంపేసి భక్షించింది. ఆ తర్వాత నదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆ మొసలిని అంతమొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. అంతే.. నదిలోని మొసలిని బయటకు లాగి కొట్టి చంపేశారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా, రాఘోపూర్ దియారా గ్రామంలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దియారా గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల కొత్త బైక్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఈ వాహన పూజకు కావాల్సిన పవిత్ర జలం కోసం అమిత్ కుమార్ అనే బాలుడు గంగానదిలోకి దిగాడు.
అమిత్ నదిలో స్నానం చేస్తుండగా, మొసలి దాడి చేసి, అతడిని కుటుంబ సభ్యుల ముందే తిలేసింది. దీంతో కటుుంబ సభ్యులు గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆ తర్వాత గ్రామస్థులంతా కలిసి బాలుడుని చంపిన మొసలి పట్టుకుని నదిలో నుంచి బయటకులాగి ఇనుపరాడ్లు, కర్రలతో కొట్టి చంపేశారు.