ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 మే 2023 (18:11 IST)

కర్నాటకలో ఘోర ప్రమాదం - ఒకే కుటుంబంలో 10 మంది మృతి

road accident
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూరు జిల్లాలోని టి.నరసిపూర్‌ ప్రాంతంలో ఓ కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. 
 
బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఇన్నోవా కారులో మైసూరుకు విహార యాత్రకు బయలుదేరింది. మార్గమధ్యంలో వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సు అమిత వేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న వారిలో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలానికి వచ్చి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు, ఈ ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో అందులో చిక్కుకున్నవారిని బయటకు తీయడం కష్టంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.