గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మే 2023 (21:27 IST)

చిన్నారిని చిదిమేసిన కారు.. పార్కింగ్‌లో పాప.. కళ్లు కూడా తెలియవా? (video)

Girl
Girl
ఓ చిన్నారిని కారు రూపంలో మృత్యువు కబళించింది. ఆ చిన్నారిని తాను పనిచేస్తున్న భవనానికి ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్ పార్కింగ్ ఏరియాలో ఓ పక్కన పడుకోబెట్టి నిద్రబెట్టి తన పనిలో నిమగ్నమైంది. 
 
అయితే అపార్ట్‌మెంట్‌లో ఉండే ఓ వ్యక్తి పార్కింగ్ ప్రాంతంలో పాప వుందని గమనించకుండా కారును నడిపాడు. అంతే కారు టైరు పాప తలమీదుగా వెళ్లింది. అంతే పాప మృతి చెందింది. 
 
ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
సీసీటీవీలో ఈ తతంగం రికార్డు అయ్యింది. నిందితుడు హరి రామకృష్ణ తన వాహనాన్ని పార్క్ చేసేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తూ నిద్రిస్తున్న లక్ష్మి అనే బాలికపైకి నడిపేశాడు.