సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (08:43 IST)

అండర్ పాస్‌ వర్షపు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రా టెక్కీ

bhanu rekahareddy
ఐటీ సిటీ బెంగుళూరు నగరాన్ని ఆదివారం వర్షం ముంచెత్తింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి సిలికాన్ సిటీ వణికిపోయింది. ఈ వర్షం కారణంగా భాను రేఖారెడ్డి (23) అనే టెక్కీ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణఆ జిల్లా తేలప్రోలుకు చెందిన టెక్కీగా గుర్తించారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు చేరుకున్నారు. 
 
కేఆర్ కూడలికి చేరుకునే సమయానికి వర్షం తీవ్రమైంది. ముందుకు వెళ్లేలోగా అక్కడి అండర్ పాస్‌లోకి ఒక్కసారిగా నీరు చొరబడింది. నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడం, కారు బయటకు వచ్చేలోగా నీరు నిండిపోయింది. దీంతో కారులో ఆరుగురు చిక్కుకున్నట్లు గుర్తించిన పోలీసులు.. బెస్కాం సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా భాను రేఖారెడ్డి మరణించారు. 
 
ఆమె కుటుంబ సభ్యులను సెయింట్ మార్థాస్ ఆసుపత్రిలో చేర్పించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కుటుంబసభ్యులకు రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. వర్షం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజులలో ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా తీసుకోవలసిన చర్యలపై నగర పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి, పాలికె కమిషనర్ తుషార్ గిరినాథ్‌తో ఆయన చర్చించారు. మృతురాలు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో ఉద్యోగిని. ఉద్యోగం రాకముందు హైదరాబాద్‌లో ఉండేవారు. ఉద్యోగంలో చేరిన మరుసటి రోజో ఆమె ప్రాణాలు కోల్పోయారు.