శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (21:39 IST)

కర్ణాటకలో ప్రధాని ఎన్నికల ప్రచారం- 26 కిలోమీటర్ల భారీ రోడ్‌ షో (video)

Modi
Modi
కర్ణాటకలో బీజేపీ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులో దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన 26 కిలోమీటర్ల భారీ రోడ్‌షోకి నాయకత్వం వహించారు.
 
ఈ కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1:30 గంటలకు ముగిసింది. మొదట్లో మే 7న షెడ్యూల్ చేయబడింది. 
 
కానీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష కారణంగా ముందుగానే నిర్వహించడం జరిగింది. దాదాపు డజను అసెంబ్లీ సెగ్మెంట్‌లను కవర్ చేస్తూ దక్షిణ-మధ్య బెంగళూరు గుండా వెళ్లేందుకు వ్యూహాత్మకంగా రోడ్‌షో నిర్వహించింది.
 
రోడ్‌షో కోసం బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందులో రోడ్ల పక్కన బారికేడ్‌లు ఏర్పాటు చేయడం, 26 కిలోమీటర్ల మార్గంలో పుష్ప వర్షం, బీజేపీ జెండాలు, అలంకరణలు అదరగొట్టాయి. ఈ రోడ్ షో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.