గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 మే 2023 (16:35 IST)

ర్యాపిడో బైక్ రైడర్ వెనుక ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తోన్న మహిళ

Rapido Bike
Rapido Bike
బెంగళూరులో ర్యాపిడో బైక్ రైడర్ వెనుక కూర్చున్న మహిళ ల్యాప్‌టాప్‌లో తన పనిలో నిమగ్నమై ఉన్నట్లు చిత్రీకరించిన చిత్రం వైరల్‌గా మారింది. కోరమంగళ-అగార-ఔటర్ రింగ్ రోడ్ స్ట్రెచ్‌లో ఈ ఫోటో తీయడం జరిగింది. 
 
నిహార్ లోహియా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ ఫోటో ఆన్‌లైన్‌లో త్వరగా ప్రజాదరణ పొందింది. "పీక్ బెంగుళూరు క్షణం. మహిళలు ర్యాపిడో బైక్ రైడ్‌లో ఆఫీసుకు వెళుతున్నారు" అనే క్యాప్షన్‌లో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
నిర్మాణ ప్రాజెక్టులు, తరచూ రోడ్డు మరమ్మతులు, ప్రధాన జంక్షన్‌ల వద్ద కలిసే అనేక ఆర్టీరియల్ రోడ్లు ఉండటం రద్దీని మరింత తీవ్రతరం చేస్తుందని స్థానికులు వాపోతున్నారు.