సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (16:11 IST)

నా భర్తకు రెండో పెళ్లి చేస్తావా? మామపై కిరోసిన్ పోసి నిప్పంటించిన కోడలు

భర్తకు రెండో వివాహం చేసిపెట్టిన మామను కోడలు సజీవదహనం చేసిన ఘటన చెన్నైకి సమీపంలో తిరువళ్లూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరుకు సమీపంలోని నెమిలి అనే ప్రాంతానికి చెందిన ప్రభాకరణ్. ఇతనికి గాయత్రి అనే మహిళతో గత ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల పాప వుంది. కానీ ఈ దంపతులు మనస్పర్ధల కారణంగా విడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో ప్రభాకరణ్ తండ్రి సభాపతి.. కుమారుడికి రెండో వివాహం చేసిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న గాయత్రి మామతో వాగ్వివాదానికి దిగింది. ఓ దశలో ఆవేశానికి గురైన గాయత్రి మామపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన సభాపతి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయత్రిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.