శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (09:18 IST)

దావూద్ ఇబ్రహీం ఫోన్ నెంబర్ డిస్‌ప్లే కాదు: సోదరుడు కస్కర్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడట. అయితే కొన్ని షరతులు మాత్రం విధించాడు. ఆ షరతులకు భారత్ అంగీకారం తెలపలేదని దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ కేసును వాదిస్తున్న

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్ ముందు లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడట. అయితే కొన్ని షరతులు మాత్రం విధించాడు. ఆ షరతులకు భారత్ అంగీకారం తెలపలేదని దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్ కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది శ్యామ్ కేశ్వాని చెప్పారు.

ఇంకా దావూద్‌ను అరెస్ట్ చేయలేదని ఇక్బాల్ సర్కార్ తెలిపారు. తాను లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ ద్వారా భారత ప్రభుత్వానికి తెలియజేసినట్లు ఇక్బాల్ సర్కార్ వెల్లడించారు. 
 
దోపిడీ కేసులో కేస్కర్‌ను థానే పోలీసులు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆర్‌వీ థమదేకర్ ఎదుట హాజరు పరిచారు. మిరా రోడ్ బిల్డర్‌ను బెదిరించిన కేసులో కస్కర్, ఆయన సోదరుడు దావూద్, అనీస్‌లపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కస్కర్‌ను న్యాయమూర్తులు అనేప ప్రశ్నలేశారు. 
 
సోదరుడు దావూద్, ఇతర కుటుంబ సభ్యులు ఎక్కడున్నారనే ప్రశ్నకు తనకు తెలియదంటూ కస్కర్ దాటవేశాడు. కానీ ఇటీవల దావూద్‌తో ఫోనులో మాట్లాడానని తెలిపాడు. కానీ తన సోదరుడి నెంబర్ డిస్‌ప్లే కాదని.. ఈ కారణంతోనే.. అతనెక్కడున్నాడనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నట్లు చెప్పాడు. ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు కస్కర్‌ కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.