శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 డిశెంబరు 2022 (14:33 IST)

వివాహ వేడుకలో సిలిండర్ పేలుడు.. 32 మంది మృతి

gas cylinder
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా షేర్కార్ సబ్ డివిజన్ భుంగ్రాలో  ఓ వివాహ వేడుకలో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 32 మంది మృతి చెందారు. ఇంకా 50 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
 
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 32 మంది చనిపోయారు. దాదాపు 50 మంది క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సిలిండర్‌ పేలుడు ఘటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజేంద్ర సింగ్‌ రాథోడ్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
 
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 100 రోజుల పాదయాత్రను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జైపూర్‌లో సంగీత కచేరీని నిర్వహించింది. ఇందులో ముఖ్యమంత్రి ఖేలత్, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా రాజేంద్ర సింగ్ రాథోడ్ మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బాధిత కుటుంబానికి గ్యాస్ కంపెనీ నుంచి కోటి పరిహారం అందించాలని  డిమాండ్ చేశారు.