బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (13:07 IST)

చెన్నైలో 2015నాటి వర్షాలు.. వరదలు ఖాయమట.. అక్టోబర్ నుంచి మే వరకు?

కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది, మధ్య ప్రాంతాల్లోనూ వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. ఈ ఏడాది దేశవ

కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది, మధ్య ప్రాంతాల్లోనూ వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా వర్షపాతం బాగానే నమోదైంది. అయితే కేరళలో మాత్రం భారీ వర్షాలు కురిశాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. 20 రోజుల పాటు కేరళలో ప్రజలు అష్టకష్టాలు అనుభవించారు. ఇంకా అదే పరిస్థితి కొనసాగుతోంది. 
 
తినడానికి తిండి లేకుండా.. తాగటానికి నీరులేకుండా ఇబ్బందులకు గురయ్యారు. వందేళ్ల తర్వాత భారీ వర్షపాతం కేరళలో నమోదైంది. ఈ భారీ వరదల్లో 400 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వరదల అనంతరం ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గడంతో బురదమయంగా కేరళ రాష్ట్రం దర్శనమిస్తోంది. వరద నీరు అనేక ఇళ్లను, రోడ్లను బురదతో నింపేసింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలు కేరళకు చేయూతనిస్తున్నా.. ప్రజలు వరదల ప్రభావం నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో.. కేరళ వరదలతో దేశ వ్యాప్తంగా ప్రజలు షాక్ తిన్నారు. గతంలో చెన్నైలో వరదలు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. 2015లో చెన్నై వరదలు భారీ ఆస్తి, ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. ప్రస్తుతం ఇదే తరహా వరదలు చెన్నైని ముంచెత్తుతాయని వేద వాతావరణ శాస్త్రవేత్త రామచంద్రన్ తెలిపారు. సెప్టెంబర్ 16వ తేదీ నుంచి రుతుపవనాలు మళ్లీ ప్రారంభం అవుతాయని, అక్టోబర్ మూడో వారం వరకు కేరళలో మళ్లీ వర్షాలు కురుస్తాయని రామచంద్రన్ హెచ్చరించారు. సెప్టెంబర్ మూడో వారం నుంచి కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని రామచంద్రన్ అన్నారు. 
 
ఐఎండీ న్యూమరికల్ ఆధారంగా రుతుపవనాలను లెక్క వేస్తారని.. నోవా లేదా యూకే బేస్ మెటాఫీస్ వంటివి ఇచ్చే వర్ష సూచనలను 24 గంటలు, 48, 72 గంటల వరకు నమ్మవచ్చునని.. వారిది అబ్జర్వేషన్ బేస్‌లోనే గణాంకాలుంటాయని రామచంద్రన్ అన్నారు. వేదిక్ మెట్రాలజీ గణాంకాలు వేరుగా వుంటాయని, ఇది కూడా సైన్స్ కిందకే వస్తుందని రామచంద్రన్ అన్నారు. 
 
ఈ ఏడాది గ్లోబల్ ఫోర్‌కాస్ట్ తానిచ్చానని.. వాటి ప్రకారం.. ప్రశంసలతో కూడిన మెయిల్స్ వస్తున్నాయని రామచంద్రన్ తెలిపారు. అమెరికాలో జనవరి 4వ తేదీ బాంబ్ సైక్లోన్ వస్తుందని చెప్పానని.. అప్పటి నుంచి జూన్ వరకు వరదలు వచ్చాయని, నార్త్ న్యూజెర్సీల్లో కార్లు షోరూమ్‌ల్లో నుంచి కొట్టుకుపోయానని రామచంద్రన్ చెప్పారు. ఈ విషయం తన గ్లోబల్ ఫోర్‌కాస్ట్‌లో వుందని గుర్తు చేశారు. 
 
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో మే 2019 వరకు వర్షాలుంటాయని చెప్పారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కేరళ వరదలు మునిగిపోయిందని.. ఈ రుతుపవనాల ప్రభావంతో ఒకేసారి, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపారు. దీని ప్రకారం అక్టోబర్ నుంచి వర్షాలు కురుస్తాయని రామచంద్రన్ చెప్పారు. గతంలో నమోదైన వర్షపాతం కంటే ఇది అధికంగా వుంటుందని రామచంద్రన్ వెల్లడించారు.