శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 14 ఫిబ్రవరి 2019 (12:49 IST)

మా ఆయన కొడుతున్నాడు.. హిజ్రా ఫిర్యాదు

ఢిల్లీ మహిళా సంఘాన్ని ఓ హిజ్రా ఆశ్రయించింది. మా ఆయన కొడుతున్నాడంటూ ఓ ఫిర్యాదు చేసింది. కొంతకాలం సహజీవనం చేశాక.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామనీ, ఇపుడు చిత్ర హింసలు పెడుతూ చితకబాదుతున్నాడని పేర్కొంది. అందువల్ల అతని నుంచి రక్షణ కల్పించాలని హిజ్రా కోరింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీకి చెందిన ఓ హిజ్రా.. తాను ఇష్టపడిన ఓ వ్యక్తితో నాలుగేళ్ళపాటు సహజీవనం చేసింది. ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది. 
 
గత రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. అయితే, పెళ్లయిన మూడు నెలల నుంచి భర్త టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఆమెను కొట్టడంతో పాటు మరో పెళ్లి చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించినందుకు ఆమెను చావబాదాడు. దీంతో బాధితురాలు ఢిల్లీలోని మహిళా కమిషన్ ఆఫీసు మెట్లు ఎక్కింది. 
 
అసలు తన భర్త తనను కొడుతున్నాడంటూ ఆ హిజ్రా మొదటగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు పట్టించుకోకపోగా, ఆమెను ఛీకొట్టారు. దీంతో ఆమె ఢిల్లీ మహిళా సంఘాన్ని ఆశ్రయించింది.