శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (18:56 IST)

సీబీఐ మాజీ డైరెక్టరుకు ఢిల్లీ హైకోర్టు అపరాధం.. ఎందుకంటే...

nageswara rao
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు తాత్కాలిక డైరెక్టరుగా అతి కొద్దికాలం పని చేసిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వర రావుకు ఢిల్లీ హైకోర్టు ఫైన్ వేసింది. తన ట్విట్టర్ హ్యాండిల్‌కు ఉన్న బ్లూ మార్క్‌ను ఆ సంస్థ యాజమాన్యం తొలగించిందని, బ్లూ టిక్‌ను పునరుద్ధరించేలా ట్విట్టర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ గతంలోనే నాగాశ్వర రావు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ దిశగా తనకు ఫలితం దక్కలేదని పేర్కొంటూ నాగేశ్వర రావు ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. 
 
దీన్ని పరిశీలించిన హైకోర్టు విచారణకు నిరాకరించింది. పైగా, ఒకే అంశంపై రెండుసార్లు ఫిర్యాదు చేస్తారా? అంటూ నిలదీస్తూ అటు నాగేశ్వర రావుపై అసహనం వ్యక్తం చేసింది. అలాగే, ఆయనకు పదివేల రూపాయల అపరాధం కూడా విధించింది. అదేసమయంలో నాగేశ్వర రావు ట్విట్టర్ హ్యాండిల్‌కు బ్లూ టిక్‌ను పునరుద్ధరించాలంటూ ట్విట్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది.