సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 జులై 2018 (16:23 IST)

16 యేళ్ళ బాలికపై భర్తతో అత్యాచారం చేయించిన భార్య.. ఎక్కడ?

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. 16 యేళ్ల బాలికపై కొందరు విటులు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. తమ లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించారు. అలా, సామూహిక అత్యాచారం చేయడమేకాకుండా, మరికొందరికి ఆ బాలి

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. 16 యేళ్ల బాలికపై కొందరు విటులు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. తమ లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించారు. అలా, సామూహిక అత్యాచారం చేయడమేకాకుండా, మరికొందరికి ఆ బాలికను సంతలో పశువును విక్రయించినట్టుగా విక్రయించేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ మహిళతోపాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఢిల్లీ, సుల్తాన్‌పురికి చెందిన ఓ బాలికకు గత నెల 30న ఉద్యోగమిస్తానంటూ అభిషేక్‌ అనే వ్యక్తి నమ్మించాడు. దీంతో అతడితోపాటు ఆమె హరిద్వార్‌‌కు వెళ్లింది. అక్కడ ఓ గదిలో బంధించి ఆ బాలికపై అభిషేక్ పలుమార్లు అత్యాచారం చేశాడు. నాలుగు రోజుల తర్వాత పాత ఢిల్లీ రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చి.. అక్కడ రవి అనే మరో నిందితుణిని పరిచయం చేశాడు. 
 
ఉద్యోగంతోపాటు ఉండేందుకు వసతి కూడా కల్పిస్తానని రవితో కలిసి అభిషేక్ నమ్మించాడు. అనంతరం గాజియాబాద్‌లోని రవి ఇంటికి బాధితురాలిని తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు అభిషేక్‌ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు రవి భార్య రింకీ కూడా బయటకు వెళ్లిపోయింది. దీంతో బాలికపై రవి అత్యాచారానికి తెగబడ్డాడు. మరుసటిరోజు ఉదయం తిరిగివచ్చిన రవి భార్యకు బాధితురాలు జరిగిన ఘోరం గురించి చెప్పినా ఫలితం లేకపోయింది. 
 
ఈ మహిళ తన భర్తతో కలిసి ఓ ముఠాకు ఆ బాలికను విక్రయించింది. బాధితురాలిని వారు రోహిణీ ప్రాంతానికి తీసుకెళ్లి మరో నిందితుడు అశోక్‌ గోయల్‌కు అప్పగించారు. రోహిత్‌, ముఖేష్‌ల సాయంతో బాధితురాల్ని కట్టేసి అశోక్‌ కూడా అత్యాచారం చేశాడు. వారినుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధిత బాలిక... తనను రోహిణీ ప్రాంతంలో నిర్బంధించినట్లు సమాచారం అందించింది. 
 
ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, వేగంగా స్పందించిన పోలీసులు రోహిణి ప్రాంతానికెళ్లి బాలికను విడిపించారు. ఆ తర్వాత రవి, రింకీ, రోహిత్‌, ముఖేష్‌లతో పాటు రవి భార్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.