శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఆగస్టు 2018 (12:14 IST)

తమ్ముడూ రజినీ... ప్రజా సేవలో కాలి చెప్పులాంటోడిని....

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వెండితెరపై వేసే పంచ్‌లకు సినీ ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. అలాంటి రజినీకాంత్ నిజ జీవితంలోనూ పంచ్‌లు వేశారు. అదీ కూడా తమిళ సూరీడు కరుణానిధిపై. దీనికి కరుణానిధి వేసిన పంచ్‌

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వెండితెరపై వేసే పంచ్‌లకు సినీ ప్రేక్షకులు ఉర్రూతలూగిపోతారు. అలాంటి రజినీకాంత్ నిజ జీవితంలోనూ పంచ్‌లు వేశారు. అదీ కూడా తమిళ సూరీడు కరుణానిధిపై. దీనికి కరుణానిధి వేసిన పంచ్‌తో రజినీతో పాటు.. అతిథులు చేసిన కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. గతంలో జరిగిన ఓ సంఘటనను పరిశీలిస్తే...
 
తమిళనాడు మాజీ సీఎం కరుణానిధితో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు మంచి సంబంధాలున్నాయి. వీరిద్దరూ ఒకే వేదికపై కలసుకున్నప్పుడు సీరియస్ పంచ్‌లు పడుతుండేవి. అలాంటి ఓ సంఘటన ఇది...
 
కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చెన్నైలో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో కరుణానిధితో పాటు.. ఈ కార్యక్రమంలో రజినీకాంత్, కరుణానిధి పాల్గొన్నారు. ముందుగా మాట్లాడిన రజినీకాంత్ సమకాలీన రాజకీయ పరిస్థితులపై మాట్లాడుతూ ఒక మాటన్నారు. 'రాజకీయ నాయకులంటే నిప్పు లాంటివారు.. వారు మనకు ఎంత సన్నిహితులైనా సరే, ఆ నిప్పుల సెగ తగలకుండా మనం జాగ్రత్తగా ఉండాలి..' అన్నారు.
 
ఆ తర్వాత మాట్లాడిన కరుణానిధి... రజినీకాంత్‌కు కౌంటర్‌గా పంచ్ వేశారు. 'తంబీ.. నాన్ ఊళలుక్కు మట్టుం నెరుప్పు... ఆనాల్ సేవయిల్ మక్కళ్ కాల్ సెరుప్పు', అంటే 'తమ్ముడూ నేను అవినీతికి మాత్రమే నిప్పులాంటోడిని.. కానీ సేవలో ప్రజల కాలి చెప్పులాంటోడిని' అని పంచ్ వేశారు. మాటల మాంత్రికుడు, సాహితీవేత్త అయిన ఈ రాజకీయ దిగ్గజం ఇచ్చిన ఆ పంచ్‌తో ఆ సభ చప్పట్లతో మారుమోగిపోయింది.