బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (08:04 IST)

డీఎంకే ఎమ్మెల్యే పార్టీ బహిష్కరణ

థౌజండ్ లైట్స్ డీఎంకే ఎమ్మెల్యే సెల్వంపై వేటు పడింది. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆయన్ని పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది.

బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాతోపాటు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను ఢిల్లీలో సెల్వం కలిసిన అనంతరం పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణా రాహిత్య చర్యలకు పాల్పడినందుకు బహిష్కరించినట్లు డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్‌ తెలిపారు.

పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి, ఉన్నత స్థాయి కమిటీ సభ్యుడు పదవుల నుంచి కూడా తొలగించామని చెప్పారు. ఇదిలా వుండగా సెల్వం త్వరలో బీజేపీలో చేరనున్నట్లు సమాచారం.