గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 ఏప్రియల్ 2020 (19:30 IST)

భూలోక దేవుళ్ళు వైద్యులు..!!

భారతదేశంలో విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టే క్రమంలో వ్యాధి సోకిన వారికి వైద్యులు ఆసుపత్రులలో అందిస్తున్న వైద్య సేవలు ఎనలేనివంటూ, చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ 'హేట్సాఫ్ టూ డాక్టర్స్ కోవిడ్-19 వారియర్స్' నినాదంతో సైకత శిల్పాన్ని ఆవిష్కరించారు.

తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ, ప్రాణ త్యాగానికి సైతం సిధ్ధపడి సేవలు అందిస్తున్న వైద్యులు, కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న యోధులుగా అభివర్ణించారు.

దీనిని గుర్తించి ప్రజలందరూ ప్రభుత్వ సూచనల ప్రకారం నివాసాలకే పరిమితమై కరోనా నియంత్రణకు సహకరించాలన్నారు. భూలోక దేవుళ్ళైన వైద్యులకు సైకత చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు తెలిపారు.