బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:45 IST)

వైద్యుల విధులకు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోండి.. కేంద్రం

తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్న వైద్యులకు కేంద్రం పూర్తి అండగా నిలిచింది. వారిపై ఎవరైనా దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. తబ్లిగీ జమాత్ కారణంగా రెండ్రోజుల్లో 647 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ 647 కేసులను 14 రాష్ట్రాల్లో గుర్తించామని పేర్కొంది.

960 మంది విదేశీ తబ్లిగీ జమాత్ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆరోగ్య ప్రోటోకాల్ పూర్తయ్యాకే వారి దేశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.