శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (16:57 IST)

బ్లూ వేల్ తరహాలో యువతలో మరో కొత్త వ్యసనం- స్టంట్ ఛాలెంజ్ వైరల్

Stunt challenge
బ్లూ వేల్ తరహాలో యువతలో మరో కొత్త వ్యసనం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ ఛాలెంజ్ 
ఇలాంటి స్టంట్ ప్రమాదకరమంటున్న వైద్యులు
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఛాలెంజింగ్ స్టంట్ వైరల్ అవుతోంది. కొందరు పిల్లలు, టీనేజర్లు ‘స్కల్ బ్రేకర్’ లేదా ‘ట్రిప్పింగ్ జంప్’ అనే స్టంట్ చేస్తున్న వీడియోలు కనిపిస్తున్నాయి. ఇదే సరికొత్త ట్రెండ్ అని టీనేజర్లు అంటున్నారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు వరుసగా నిలబడి ఉంటారు. 
 
మధ్యలో వ్యక్తి గాల్లో ఎగిరినప్పుడు చెరోవైపు నుంచి ఇద్దరు వ్యక్తులు గాల్లో ఎగిరిన వ్యక్తి కాళ్లని కొడతారు, కానీ గాల్లో ఎగిరిన ఆ వ్యక్తి వారి నుంచి తప్పించుకోవాలి లేకోపోతే నేలమీద గట్టిగా పడతాడు. అలా నేల మీద పడినప్పుడు తల పగిలే అవకాశముంది లేదా చేతులు విరిగే అవకాశముంటుంది. అందుకే ఇది భలేగా ఉంది అంటున్నారు టీనేజర్లు. 
Stunt challenge
 
టిక్ టోక్‌లో ప్రస్తుతం ‘స్కల్ బ్రేకర్’ ఛాలెంజ్ వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఇంతకుముందు బ్లూ వేల్, మోమో ఛాలెంజ్‌లని యువత ఈ స్టంట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. టిక్ టోక్‌లో స్కల్ బ్రేకర్ వీడియోలు చూసి తమ పిల్లల పట్ల తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు.  
Stunt challenge
 
ఇలాంటి స్టంట్లు చేయడం వల్ల తల, చేతి ఎముకలు విరిగే ప్రమాదముందని వైద్యలు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఈ స్టంట్లు చేయకుండా స్కూలు, కాలేజీ యజమాన్యాలు జాగ్రత్త వహించాలని తల్లిదండ్రుల కోరుతున్నారు. 

Stunt challenge