1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఏప్రియల్ 2023 (17:03 IST)

ఇండిగో విమానంలో ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచిన ప్రయాణీకుడు

indigo flight
ఢిల్లీ-బెంగళూరు మధ్య ప్రయాణించిన ఇండిగో విమానంలో మద్యం మత్తులో విమానం ఎమర్జెన్సీ డోర్‌ను ఓ ప్రయాణీకుడు తెరవబోయాడు. సిబ్బంది, పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రయాణీకుడిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేశారు. 
 
ప్రతీక్ అనే 40 ఏళ్ల ప్రయాణికుడిపై అధికారులు కేసు నమోదు చేసినట్టు విమానయాన సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం ఇండిగో 6ఈ 308 విమానంలో ప్రతీక్ ప్రయాణించాడు. 
 
ఢిల్లీ నుంచి విమానం బయల్దేరే ముందు ఎయిర్ లైన్స్ సిబ్బంది ఎప్పట్లానే భద్రత నిబంధనల గురించి తెలిపారు. ఎమర్జెన్సీ డోర్ గురించి కూడా స్పష్టమైన సూచనలు చేశారు.