సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (18:12 IST)

కట్నం కోసం భార్యను దొడ్డుకర్రతో చావబాదిన భర్త - మరిది

హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో అదనపు కట్నం భార్యను భర్త దొడ్డుకర్రతో చావబాదాడు. అతనితో పాటు.. అతని తమ్ముడు కూడా ఆ మహిళను కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే ఫరీదాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని పాటియాకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చారు. అయితే, కానీ అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు. అయితే, తమ తల్లిదండ్రులు అదనపు కట్నం ఇచ్చుకోలేరని చెప్పడంతో ఆమెను పట్టుకుని దొడ్డుకర్రతో చితకబాదారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో లీక్ కావడంతో వైరల్ అయ్యాయి.
 
దీనిపై బాధిత మహిళ స్పందిస్తూ, తమ తల్లిదండ్రులు అదనపుకు కట్నం ఇచ్చుకోలేరనీ, అందువల్ల తన భర్తకు విడాకులు ఇస్తానని చెప్పింది. పైగా, తనను భర్తతో పాటు.. అతని తమ్ముడు, అత్తమామలు కలిసి తీవ్రంగా కొట్టారని చెప్పారు. దీనిపై ఫరీదాబాద్ డిప్యూటీ కమిషనర్ విక్రమ్ కపూర్ స్పందిస్తూ, ఇది భార్యాభర్తల మధ్య గొడవని, ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసినట్టు తెలిపారు.