శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (17:06 IST)

10 నెలల బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పది నెలల బాలికపై 15 సంవత్సరాల మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడింది పొరుగింటి యువకుడే కావడం గమనార్హం. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు ఆదివారం సాయంత్రం చిన్నారని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడని వెల్లడించారు. ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడుని అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, బాధితురాలిని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. 
 
అలాగే, వంటచెరకు కోసం వెళ్లిన ఓ మహిళపై ముగ్గురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఛత్రాఘర్ ఏరియాలో జరిగింది. ఈ నెల 15వ తేదీ ఓ వివాహిత వంట చెరకు కోసం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన కొందరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.