సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (17:17 IST)

ప్లాన్‌ను మార్చేసిన రైతులు.. ఛలో పార్లమెంట్ వాయిదా

తమ డిమాండ్ల పరిష్కార సాధన కోసం గత యేడాది కాలంగా ఢిల్లీ సరిహద్దుల వెంబడి ఆందోళన చేస్తున్న రైతులు ఉన్నట్టుండి తమ ప్లాన్‌ను మార్చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి రెండు రోజుల ముందు అన్నదాతలు తమ నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. 
 
ఇందులోభాగంగా, పార్లమెంట్ ముట్టడి (ఛలో పార్లమెంట్) కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. కొత్త సాగు చట్టాల రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల తొలి రోజునే బిల్లును ప్రవేశపెట్టనుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో రైతులు వ్యూహాత్మకంగా వాయిదావేశారు. ఈ మేరకు శనివారం సమావేశమైన అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా నేతలు నిర్ణయం తీసుకున్నారు. 
 
మరోవైపు, రైతులు తమ ఆందోళనను విరమించి, సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో చర్చలు జరిపేందుకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పిలుపునిచ్చారు. దీనిపై రైతు సంఘాల సమాఖ్య నేతలు స్పందించాల్సివుంది.