సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

స్టేషన్‌లో ఆగివున్న రైలు బోగీలో మంటలు.. రెండు నెలల్లో రెండో ఘటన

train catch fire
కేరళ రాష్ట్రంలోని ఆళప్పుళ - కన్నూరు ప్రాంతాల మధ్య నడిచే ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. కన్నూరు రైల్వే స్టషన్‌లో రైలు ఆగివున్న సమయంలో ఓ బోగీ నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్టేషన్ అధికారులు వెంటనే అప్రమత్తమై మంటలు చెలరేగిన బోగీల నుంచి ఇతర బోగీలను వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఫైరింజన్లతో స్టేషన్‌కు వచ్చిన మంటలను ఆర్పివేశాయి. 
 
ఒక బోగీ నుంచి మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మిగతా బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి బోగీలోకి ఎక్కిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. 
 
కాగా, ఏప్రిల్ 2వ తేదీన ఇదే రైలులో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. షారూక్ సఫీ అనే వ్యక్తి రైలు బోగీలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇపుడు మళ్లీ అదే రైలులో అగ్నిప్రమాదం జరగడం గమనార్హం.