మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 సెప్టెంబరు 2024 (13:08 IST)

రూ.33 కోట్లు దారి మళ్లించిన స్విగ్గీ మాజీ ఉద్యోగి!

swiggy
స్విగ్గీలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి ఒకరు రూ.33 కోట్ల మేరకు దారి మళ్లించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగి ఒకరు తాను ఉద్యోగం చేసిన సమయంలో రూ.33 కోట్ల మేరకు దారి మళ్లించినట్టు ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది. దీనిపై స్విగ్గీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
స్విగ్గీ 2023-24 వార్షిక నివేదికను సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఓ అనుబంధ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి కంపెనీ నుంచి రూ.33 కోట్లు దారి మళ్లించినట్టు వార్షిక నివేదికలో గుర్తించారు. 
 
ఈ అంశంపై స్విగ్గీ అంతర్గతంగా దర్యాప్తు చేసేందుకు కొందరు సభ్యులతో బృందాన్ని నియమించింది. అలాగే కోట్లాది రూపాయల దారి మళ్లించినందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం విడుదల చేసిన వార్షిక నివేదికలో స్విగ్గీ వెల్లడించిందని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, స్విగ్గీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.